- Andhra Pradesh State and Subordinate Service Rules 1996
- Andhra Pradesh Secretariat Subordinate Service Rules
- Andhra Pradesh Secretariat Service Rules
- Andhra Pradesh Last Grade Service Rules
- Andhra Pradesh Civil Services (conduct) Rules 1964
- GO Ms.No.528, Dt.19-08-2008 (conduct rules annexure.doc)
- GO Ms.No.680, Dt.01-11-2008 (conduct rules annexure2.doc)
- Instructions on Maintenance and Scrutiny of Personal Files I
- Instructions on Maintenance and Scrutiny of Personal Files II
- Andhra Pradesh Civil Services (Disciplinary Proceedings Tribunal) Act
- AP Civil Services (CCA) Rules 1991
- Appendix II – AP Civil Services (CCA) Rules 1991
- Instructions on General Office Procedure -8
- Andhra Pradesh Ministerial Service Rules 1998
- APPSC – Commission’s Regulations & Rules of Procedure
- Hand Book on Instructions on Observance of Courtesies in dealing with Members Of Parliament and State Legislature
- Appointment of Son/Daughter/Spouse of Govt,Servant who die in harness while in service/Retire on Medical Grounds
Fundamental Rules
Child care leave clarification
DOWNLOAD SOME G.O CPYs
STEP UP AND PREPONEMENT INFORMATION
STEP UP AND PREPONEMENT INFORMATION
స్టెప్‌అప్, ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్
ఫండమెంటల్ రూల్స్ - ఫిక్సేషన్, ఇంకిమ్రెంట్లు
ఒక ఉద్యోగి వేరొక పోస్టులో నియమించబడినపుడు లేదా ప్రమోషన్ పొందినపుడు ఫండమెంటల్ రూల్స్ 22, 30, 31 ప్రకారం అతనికి వేతన స్థిరీకరణ జరుగుతుంది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండా ఈ నిబంధనల ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది. సెలక్షన్ గ్రేడు, 6/12/18/24 సంవత్సరాల స్కేళ్లు, రివైజ్డ్ పే స్కేల్సు తదితరవాటిలో ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేస్తారు. అలాగే ఉద్యోగి సర్వీసునుబట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు. ఇంక్రిమెంట్ల మంజూరు, ప్రీపోన్మెంట్, పోస్టుపోన్మెంటు మొదలైనవి ఫండమెంటల్ రూల్స్ 24, 26, 27 ప్రకారం జరుగుతాయి.
ఎఫ్‌ఆర్-22(ఎ)(ఱ) : అదనపు బాధ్యతతో కూడిన పోస్టునందు నియమితులైనపుడు, నూతన స్కేలులోని తదుపరి స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. అలాంటి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుంచి 12 నెలల సర్వీసు నిండిన తరువాత ఇంక్రిమెంటు ఇస్తారు.
ఉదా: 10,900-31,500 స్కేలులో రూ.11,860 వేతనం తీసుకునే ఉద్యోగి 14,860-39,540 స్కేలున్న పోస్టులో నియమించబడితే అతని వేతనాన్ని రూ.14,860గా స్థిరీకరిస్తారు.
ఎఫ్‌ఆర్-22(ఎ)(ఱఱ) : అదనపు బాధ్యతలేని పోస్టునందు నియమించ బడినపుడు, నూతన స్కేలులోని దిగువ స్టేజి వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే...ఎ) పాత స్కేలులోని మూల వేతనానికి సమానమైన స్టేజి నూతన స్కేలులో ఉంటే, ఆ సమాన స్టేజి వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీనే కొనసాగుతుంది.
ఉదా : 5470-12,385 స్కేలులో రూ.7,385 వేతనం పొందుతున్న ఉద్యోగి 7,200-16,925 స్కేలులో నియమితులైతే, అతని వేతనం రూ.7,385 వద్దనే స్థిరీకరిస్తారు.
బి) ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనానికి సమానమైన స్టేజి లేకుంటే దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన వ్యత్యాసం పర్సనల్ పేగా నమోదు చేస్తారు. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.
ఉదా : 1,010-1,800 స్కేలులో రూ.1,360 వేతనం పొందుతున్న ఉద్యోగికి 1,280-2,440 స్కేలులో రూ.1,330+30 పిపిగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.
సి) పాత స్కేలులోని మూలవేతనం నూతన స్కేలు మినమం కంటే తక్కువగా ఉంటే, మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి ఇంక్రిమెంటు ఇస్తారు.
ఉదా : 10,900-31,550 స్కేలులో రూ.11,860 వేతనం పొందుతున్న ఉద్యోగికి, 14,860-39,540 స్కేలులో రూ.14,360 వద్ద స్థిరీకరించబడుతుంది.
సీనియర్ స్కేలు ఎక్కువున్నా స్టెపప్ చేయవచ్చా?
1. ఇద్దరు ఉద్యోగులలో ఒకరు 2002 సంవత్సరంలో ప్రమోషన్ పొందగా అతని వేతనము యఫ్.ఆర్. 22 (ఎ) (ఱ) ప్రకారము స్థిరీకరించబడినది. ఆ తదుపరి తేది 1-2-2009న స్పెషల్ గ్రేడు స్కేలు కూడా మంజూరైనది. కాగా జూనియర్‌కు 16 సంవత్సరాల స్కేలు మంజూరు తదుపరి తేది 20-5-2011న ప్రమోషన్ ఇవ్వబడినది. ప్రమోషన్ పోస్టు స్కేలులో అతని వేతనము యఫ్.22బి ప్రకారము స్థిరీకరించబడినందున జూనియర్ వేతనము ఎక్కువగాను, సీనియర్ వేతనము తక్కువగాను వున్నది. అయితే జూనియర్ స్కేలు తక్కువగాను, సీనియర్ స్కేలు ఎక్కువగాను వున్నది. అట్టి సందర్భములో సీనియర్ స్టెపప్ పొందుటకు అవకాశం ఉన్నదా? -వై.కిరణ్, సిరిసిల్ల, కరీంనగర్‌జిల్లా.
2010 వేతన సవరణ స్కేళ్లలో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంటు స్కేళ్లకు సంబంధించి ఇచ్చిన జి.ఓ.93 నందు సీనియర్, జూనియర్ వేతన స్టెప్‌అప్ వర్తింపజేయుటకు విధించిన షరతులలో ''సీనియర్, జూనియర్ ఒకే వేతన స్కేలులో వుండాలి'' అనే షరతు మీరు పేర్కొన్న సీనియర్ వేతనమును స్టెప్‌అప్ చేయుటకు అడ్డంకిగా వున్నది. అయితే సీనియర్ వేతన స్కేలు ఎక్కువగా నున్న సందర్భములోను సీనియర్, జూనియర్ వేతన వ్యత్యాసమును సవరించడం సహజ న్యాయసూత్రాలకు అనుగుణమైనది గనుక ఆ మేరకు సవరణ ఉత్తర్వులు పొందుటకు ఉద్యోగ సంఘాలు ప్రాతినిద్యం చేయవలసి వున్నది.
2. ఒక ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో జూన్ 1989లో రికార్డు అసిస్టెంట్‌గా నియమించబడిన నేను సెప్టెంబర్ 1991లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొదాను. 2007లో 16 సంవత్సరాల స్కేలు తీసుకొన్నాను. 52 సంవత్సరాల వయసుగల నేను ఏ టెస్టులూ పాస్‌కాలేదు. 18 సంవత్సరాల స్కేలు పొందే అవకాశం వున్నదా? నేను తప్పనిసరిగా పాస్ కావలసిన టెస్టులేమైనా వున్నాయా? -ఆర్. మురళి, శ్రీకాకుళం.
రికార్డు అసిస్టెంట్‌గా నియమించబడిన ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందిన మీదట సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందాలన్నా, లేక 16 సం||ల స్కేలు పొందాలన్నా సంబంధిత పార్టుమెంటల్ టెస్టులు పాస్ కావలసి వుంటుంది. ఎందుకనగా ఉద్యోగి సర్వీసుకాలంలో కనీసం ఒక ప్రమోషన్ పొందుటకుగాను అతనికి 45 సంవత్సరాల వయసు నిండి తేది డిపార్ట్‌మెంటల్ టెస్టులనుండి మినహాయింపు వర్తిస్తుందని జి.ఓ.యం.యస్.నెం.225 జిఎడి శాఖ, తేది 18-5-1999 నందు స్పష్టముగా పేర్కొనబడినది. కాగా 18 సంవత్సరాల స్కేలు పొందుటకు ఎట్టి అదనపు టెస్టులూ పాస్ కావలసిన అవసరం లేదు. 18 సంవత్సరాల సర్వీసు నిండిన మరుసటి రోజున 16 సంవత్సరాల స్కేలులోనే ఒక ఇంక్రిమెంటును కలుపుతారు.
3. మా కారుణ్యలయాధిపతి ''మీ విధులపట్ల ఉపేక్ష, అశ్రద్ధలతో వ్యవహరిస్తున్నారు గనుక మీపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకొనకూడదో సంజాయిషీ ఇవ్వండి'' అని మా సహచర ఉద్యోగికి నోటీసు ఇచ్చారు. ఈ అభియోగములతో సదరు ఉద్యోగిపై ఏ రకమైన క్రమశిక్షణగా చర్యలు తీసుకొనుటకు అవకాశమున్నది? -ఎ. నర్సింహం, సంగారెడ్డి.
మీరు పేర్కొన్న విధముగా సంజాయిషి నోటీసు ఇచ్చివుంటే, అందులో పేర్కొనిన అభియోగములలో స్పష్టత లేదు గనుక నేను స్పష్టమైన సంజాయిషీ ఇచ్చు కొనలేక పోతున్నారు.'' అని సదరు ఉద్యోగి కార్యాలయాధిపతికి తెలియజేసుకొనుటకు అవకాశం వున్నది. ఉద్యోగిపై మోపబడిన అభియోగములో స్పష్టత వున్నప్పుడు మాత్రమే సి.సి.ఎ. నిబంధనల మేరకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు వీలున్నది. సదరు విషయమై జి.ఓ.680 జిఎడి శాఖ తేది 01-11-2008 ద్వారా ఇచ్చిన వివరణ ఉత్తర్వులను పరిశీలించండి?