About Nellore District

State: Andhra Pradesh        District Name: Nellore 
Region: Coastal Andhra 
Pin: 524000 Tele Code: +91 861 Vehicle Code: AP 08
Languages: Telugu Urdu Hindi Area: 13,076 Sq kms 
Nellore City: 250 Sq kms Population: 2,963,557 Jana Sandrata: 224 
Female: Male (East: Nishpathi) 1000 : 984 
Population Increase: 24%
Literacy: 68.90%SC Population: 5,00,000 plus ST Population: 2,00,000 plus 
MP Constituencies: 1 

: 10 

Nellore Rural Nellore Urban Kovuru AtmakurSarvepally 

Guduru Udayagiri Kavali Sullurupeta Venkatagiri

Muncipal Corporation;1  Nellore

 Muncipalities: 7 : Kavali Guduru Sullurupeta Venkatagiri Kovuru Naidupeta

జిల్లా కలెక్టరు : 9849904051, 0861-233199, 2331235
జాయింట్ కలెక్టరు : 9849904052, 2331644, 2331624
జిల్లా రెవెన్యూ అధికారి : 9849904053
జిల్లా ప్రజాసంబంధాల అధికారి : 9949351619
సాంఘీక సంక్షేమ శాఖ డి.డి. : 0861 2327341
ఎస్.సి. కార్పొరేషన్ ఇ.డి. : 9849905971, 2324763, 2331576
బి.సి. కార్పొరేషన్ ఇ.డి. : 9849906012, 2322108, 2332962
ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి : 9440806688, 2327940, 2336363
వ్యవసాయశాఖ జె.డి. : 9440816768, 2326415, 2327264
పశుసంవర్థకశాఖ జె.డి. : 9440810761, 2331855, 2331454
స్త్రీ శిశు సంక్షేమ శాఖ పి.డి. : 9440455102, 2329481, 2346402
జిల్లా వైద్య ఆరోగ్యాధికారి : 9849902361, 2331435, 2323438
జిల్లా పరిషత్ ఛైర్మన్ : 9849499066, 2331670, 2331201
జిల్లా పరిషత్ సి.ఇ.ఒ. : 9866233370
నీటిపారుదలశాఖ ఎస్.ఇ. : 9440276580, 2327658, 2328540
రెవెన్యూ డివిజన్ పాలనాయంత్రాంగం
నెల్లూరు ఆర్డీవో 2331635 9849904055
డివిజనల్ పరిపాలనాధికారి 2331635 9849904061
గూడూరు ఆర్డీవో 251613 9849904056
డివిజనల్ పరిపాలనాధికారి 251087 9849904062
కావలి ఆర్డీవో 241564 9849904054
డివిజనల్ పరిపాలనాధికారి 241564 9849904060

నెల్లూరు జిల్లా నాగరికతకు పుట్టినిల్లు. ఎన్నో శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. అక్కడక్కడ విసిరేసినట్లు నివాసాలు కనిపించేవి. ఆదివాసీలు ఎక్కువగా ఉండేవారు. కాలక్రమేణా అడవులు నరికివేయగా గ్రామాలు వెలిశాయి. అలా వ్యవసాయానికి పునాది పడింది. పెన్నా డెల్టాగా ప్రసిద్ధి గాంచింది. నెల్లూరు ప్రాంతాన్ని ఎన్నో వంశాలు పాలించాయి.

మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, తెలుగు చోళులు, పాండ్యులు ఏలారు. ఆ తర్వాత గజపతులు, విజయనగర రాజులు, మహమ్మదీయులు, గోల్కొండ సుల్తానులు, ఆర్కాటు నవాబుల ఆధీనంలోనూ కొనసాగింది. కాలక్రమేణ డచ్‌లు, ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది. జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమానికి వూపిరి పోసిన వారిలో పొట్టిశ్రీరాములు, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, రేబాల లక్ష్మీనరసారెడ్డి, డాక్డర్ బెజవాడ గోపాలరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, పొణకా కనకమ్మ తదితరులు ఉన్నారు.
వరి విస్తారంగా పండే ప్రాంతం కావడంతో నెల్లూరుగా పేరు వచ్చిందని ప్రతీతి. ఇది తమిళనామం. ఆ భాషలో 'నెల్లు' అంటే వరి అని అర్థం. అలా నెల్లు+వూరు... క్రమేపీ నెల్లూరుగా వాడుకలోకి వచ్చిందంటారు. పచ్చని పొలాలతో ప్రశాంతమైన ప్రాంతం కావడం వల్ల నల్ల+వూరు (మంచి వూరు) క్రమేపీ నెల్లూరుగా మారిందన్న వాదనా ఉంది.
పల్లవుల కాలంలో నెల్లూరు అంతా అటవీ ప్రాంతం. అప్పట్లో చెట్లు కొట్టేస్తున్న సమయంలో ఒక ఉసిరిక చెట్టు కింద శివలింగం కనిపించింది. ఈ విషయం తెలిసిన ముక్కంటి రాజు గుడి కట్టించాడని, అలా ఏర్పడిన మూలస్థానేశ్వరస్వామి ఆలయం నెల్లూరు పట్టణానికి బీజమైంది. తమిళంలో నెల్లి అంటే ఉసిరిక. నెల్లి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షమైంది, కాబట్టి నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు.
నెల్లూరుకు సింహపురి అనే పేరు కూడా ఉంది. పల్లవరాజు సింహవిష్ణు పరిపాలించినందున ఈ పేరు వచ్చిందని చెబుతారు. పరాక్రమానికి, అసమాన శౌర్యానికి ప్రతీకగా విక్రమ సింహపురిగా 11వ శతాబ్దం వరకు పిలిచేవారు. రెండో మనుమసిద్ధి కాలం విక్రమ సింహపురికి స్వర్ణయుగం. జిల్లాలోని వెంకటగిరి రాజాలది 31 తరాల చరిత్ర. అనంతరం ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది. 1956 నవంబరులో ప్రస్తుతం ఉన్న మండలాలతో నెల్లూరు జిల్లా ముఖచిత్రం ఏర్పడింది. 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మారింది.

విశిష్ఠతలు
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం మద్రాసులో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు నెల్లూరు జిల్లాతో అనుబంధం ఉంది. కలిగిరి మండలం పడమటిపల్లికి చెందిన ఆర్యవైశ్య కుటుంబం నుంచి వచ్చారు. గ్రామంలో వ్యాపారం సాగక, కరవు కాటకాలతో జీవనం కష్టమై, ఈయన తల్లిదండ్రులైన పొట్టి గురువయ్య, మహాలక్ష్మమ్మలు మద్రాసుకు వలస వెళ్లారు. అక్కడే శ్రీరాములు పుట్టారు. గాంధీజీ శిష్యునిగా శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంటరానితనం రూపుమాపడానికి, స్వాతంత్య్ర సాధనకు పోరాటం సాగించారు.
జువ్వలదిన్నె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించారు. మూడుసార్లు జైలుకెళ్లారు. అందుకే ఇటీవల జిల్లా పేరును శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుగా మార్చారు.
తెలుగులో మహాభారతాన్ని అనువదించిన తిక్కన, రామాయాణాన్ని రచించిన మొల్ల నెల్లూరు ప్రాంతీయులే. ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మనుమసిద్ధి రాజు వద్ద మంత్రిగా పనిచేసిన తిక్కన నెల్లూరులో పెన్నానది ఒడ్డున మహాభారతంలో 15 పర్వాలను తెలుగులోకి అనువదించారు. కలువాయి మండలం గోపవరం గ్రామానికి చెందిన మొల్ల 800 ఏళ్ల క్రితం తెలుగులో రామాయణం రాసింది. ఇది మొల్ల రామాయణంగా పాచుర్యంలో ఉంది.
చేనేత జరీ చీరలకు వెంకటగిరి, పాటూరు ప్రసిద్ధి చెందాయి. వెంకటగిరి చేనేత పరిశ్రమ దేశంలోనే గుర్తింపు పొందింది.
నెల్లూరు జిల్లా ఉద్యమాలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజలు స్వాతంత్య్ర పోరాటంలో ముందు నిలిచారు. ఆనాడు కల్లుపై ఉద్యమం నడిపారు. సారా వ్యతిరేక ఉద్యమానికి నెల్లూరు వూపిరిపోసింది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం 'సతీష్‌ధావన్ అంతరిక్షప్రయోగకేంద్రం ' ఉంది. ఇక్కడి నుంచి మొదటిసారిగా రోహిణి-125 అనే చిన్న రాకెట్‌ను ప్రయోగించారు. ఆ తర్వాత ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి పంపారు. ఇవి ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలోనే శ్రీహరికోటకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
సినీ పరిశ్రమతో నెల్లూరు జిల్లాకు ఎంతో అనుబంధం ఉంది. మూకీ సినిమాల్లో మొట్టమొదటి నెల్లూరు నటుడు సి.పుల్లయ్య. టాకీ చిత్రాల్లో మొదటి నటుడు ఘంటసాల రాధాకృష్ణమూర్తి. ప్రథమ దర్శకుడు వై.వి.రావు 1933లో తమిళంలో సావిత్రి సినిమా తీశారు. 1935లో పుల్లయ్య తెలుగులో హరిశ్చంద్ర సినిమా తీశారు. లవకుశ సినిమా నిర్మించిన అల్లారెడ్డి శంకరరెడ్డి కూడా ఈ జిల్లావారే.
వై.వి.రావు, పి.చంద్రశేఖరరెడ్డి, పి.మధుసూదనరావు, సీఎస్ఆర్ దాస్, సింగీతం శ్రీనివాసరావు, ఎ.కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య వంటి ప్రముఖ దర్శకులు జిల్లాకు చెందిన వారే. కాంతారావు, వాణిశ్రీ, రాజనాల, నాగభూషణం, రమణారెడ్డి వంటి మేటి నటులు ఈ జిల్లా నుంచి వచ్చిన వారే. ప్రఖ్యాత నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు బిడ్డ. నేపథ్య గాయకులు ఎస్పీ శైలజ, మోహన్‌దాస్ కూడా నెల్లూరు జిల్లావారే.
స్వాతంత్య్ర సమరంలో..
నెల్లూరు ప్రజలు దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు. వందేమాతరం, స్వదేశీ ఉద్యమాల్లో పాల్గొని రాజకీయ చైతన్యాన్ని, దేశభక్తిని చాటుకున్నారు. 1904నాటి స్వదేశీ తీర్మానం మేరకు.. కావలిలో ఓరుగంటి వరదయ్య స్వదేశీ వస్తువిక్రయశాలను నెలకొల్పగా, పొణకా కనకమ్మ, నెల్లూరు వెంకట్రామానాయులు పోట్లపూడిలో చేతిమగ్గాలను ఏర్పాటు చేశారు.
1916 నాటికి తిలక్ ప్రవేశపెట్టిన హోంరూల్‌కు అనుబంధంగా నెల్లూరు, కావలిల్లో శాఖలు ఏర్పడ్డాయి. పోట్లపూడిలో పొణకా కనకమ్మ, పొణకా పట్టాభిరామిరెడ్డి 'సుజన రంజని' సమాజాన్ని నెలకొల్పారు.
రౌలత్ చట్టం, జలియన్‌వాలాబాగ్ దురాగతాలకు వ్యతిరేకంగా 1919లో రాళ్లపల్లి రామసుబ్బయ్య ఉద్యమించారు. ఎందరో దేశభక్తులు న్యాయవాద వృత్తిని, ప్రభుత్వోద్యోగాలను మానుకున్నారు.
1923లో పొణకా కనకమ్మ నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయాన్ని నెలకొల్పారు.
పల్లెపాడులో గాంధీజీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని 1921లో నెలకొల్పిననాటి నుంచి అస్పృశ్యతానివారణ, ఖద్దరు వ్యాప్తి ఉద్యమాలు వూపందుకున్నాయి. 1929లో గాంధీజీ నెల్లూరు జిల్లాలో పర్యటించి చేసిన ప్రసంగాలతో ప్రభావితులైన మహిళలు ఖద్దరు నిధికి తమ ఆభరణాలనుఅందించారు.
1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఓరుగంటి వెంకట సుబ్బయ్య నాయకత్వంలో బెడవాడ గోపాలరెడ్డి, వేమూరి లక్ష్మయ్య, లేబూరి సుబ్బరామిరెడ్డి, ఓరుగంటి మహలక్ష్మమ్మ, పొణకా కనకమ్మ పాల్గొన్నారు. మైపాడు, తుమ్మలపెంట, సూళ్లూరుపేట తదితర సముద్రతీరాల్లో ఉప్పు తయారీకి పూనుకొనడమే కాకుండా జైలుకు వెళ్లారు.
స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మహాత్మగాంధీ అయిదుసార్లు నెల్లూరుకు వచ్చారు. 1915, 1921, 1929, 1933, 1946ల్లో నెల్లూరు పట్టణం మీదుగా పర్యటించారు. 1915లో నెల్లూరు పర్యటన సందర్భంగా గాంధీజీ అప్పటి కలెక్టర్ రామచంద్రారావు ఇంట్లో బస చేశారు. కలెక్టర్ ఇంట్లో భక్త ప్రహ్లాద నాటకాన్ని కూడా చూడటం విశేషం. 1946లో నెల్లూరు వచ్చిన గాంధీ కొండాయపాలెం గేటు వద్ద ప్రజలకు దర్శనమిచ్చారు.
కానీ మౌన వ్రతం ఉండడంతో ప్రజలతో ఏమీ మాట్లాడలేకపోయారు. స్వతంత్ర సమరంలో పాల్గొన్న పుచ్చలపల్లి సుందరయ్య విద్యార్థి దశలోనే సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. భీమవరంలో ఉప్పు సత్యాగ్రహంలోపాల్గొన్నారు.
గాంధీజీ పిలుపుతో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో నెల్లూరీయులు పాల్గొన్నారు. విద్యార్థులు, హరిజనులు, గిరిజనులు, భూస్వాములు, రైతులు, కూలీలు, మైనార్టీలు ఏకోన్ముఖంగా పోరాటంలో ఘనమైన పాత్ర పోషించి జాతీయ నేతల ప్రశంసలు పొందారు.
 

శిక్షణ కేంద్రాలు
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ కేంద్రం, ఏసి సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు : 0861 2326401
ఐ.ఐ.హెచ్.టి., వెంకటగిరి : 08625-257260
ప్రభుత్వ ఐ.టి.ఐ., వెంకటగిరి : 08625-257479
గౌతమి నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్, వెంకటగిరి
రమణమ్మ ఐటిఐ, కోవూరు
డైట్ సెంటర్, పల్లిపాడు, ఇందుకూరుపేట మండలం
పాలిటెక్నిక్ కళాశాల, కావలి
పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐఐటి) వాకాడు : 08624 240208

పెన్నానది 
పెన్ననదికి మరో పేరు పినాకిని. జిల్లాకు సాగు, తాగునీరు అందించే పెన్నానది నెల్లూరు నాగరికతకు ఆధారం. కర్నాటక రాష్ట్రంలో చెన్నకేశవ కొండల్లో పుట్టిన ఈ నదిని 'ఉత్తర పినాకిని'గా పిలుస్తారు. మన రాష్ట్రంలోకి అనంతపురం జిల్లాలో ప్రవేశించి కడప జిల్లా మీదుగా వెలుగొండ కనుమల్లో పయనిస్తుంది. నెల్లూరు జిల్లాలోకి సోమశిల వద్ద ప్రవేశిస్తుంది. అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల మీదుగా 112 కి.మీ. ప్రవహించి ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
 
జిల్లా పరిధిలో పెన్నానదిలో కోలగట్ల వద్ద బొగ్గేరు, సంగం వద్ద బీరాపేరు వాగులు కలుస్తాయి. నెల్లూరు వద్ద పెన్నానదిపై రోడ్డు, రైలు వంతెనలు ఉన్నాయి.
స్వర్ణముఖి
చంద్రగిరి కొండల్లో పుట్టిన స్వర్ణముఖి నది చిత్తూరు. నెల్లూరు జిల్లాల్లో 155 కి.మీ. దూరం ప్రవహిస్తోంది. నదిలో ఇసుక రేణువులు బంగారు వర్ణం కలిగి ఉండడంతో స్వర్ణముఖిగా పేరొచ్చింది. రేణుగుంట వద్ద రాళ్లకాలువ, గూడలి వద్ద మామిడి కాలువలు దీనిలో కలుస్తాయి. జిల్లాలో నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, చిట్టమూరు, కోట, వాకాడు మండలాల మధ్యగా ప్రవహించి పులికాట్ సరుస్సుకు ఉత్తరంగా సిద్ధవరం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. వర్షాకాలంలో నదికి ప్రవాహం వస్తే 13,740 శతకోటి ఘనపుటడుగులు వరదనీరు అందుతుంది.
బ్యారేజీ, చెక్‌డ్యాంల ద్వారా 10,663 శతకోటి ఘనపుటడుగుల నీటిని చెరువులకు మళ్లించి వ్యవసాయానికి వినియోగిస్తారు.
కండలేరు: వెలిగొండల్లో పుట్టిన కండలేరు రాపూరు, మనుబోలు తదితర మండలాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది.
పిల్లాపేరు: ఉదయగిరి నియోజకవర్గంలోని పోలంగివారిపల్లి వద్ద మర్రివూట్ల జలాశయం, సీతారామపురం చెరువు ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలు కలసి పిల్లాపేరు ఏర్పడింది. సీతారామపురం, ఉదయగిరి మండలాల్లో ప్రవహిస్తూ గండిపాళెం జలాశయంలో కలుస్తుంది. దీని కింద ఉన్న 7వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది.
పైడేరు
అల్లూరు డెల్టా ప్రాంతంలో పాడిపంటలకు మూలాధారం పైడేరు. దగదర్తి, అల్లూరు, కొడవలూరు, విడవలూరు మండలాల మీదుగా ప్రవహించి పొన్నపూడి, గోగులపల్లి మధ్యన సముద్రంలో కలుస్తోంది. ఈ నాలుగు మండలాలతో పాటు బొగోలు ప్రాంతంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. పూర్వం రాజుల కాలం నాడే పైడేరు వాగు ద్వారా వచ్చే వరదనీటిని అల్లూరు చెరువుకు మళ్లిస్తూ కాలువలు తవ్వారు. దీంతో వ్యవసాయానికి సాగునీటి సమస్య ఎదురవ్వడం లేదు. ఫలితంగా ఈ ప్రాంతం పంటల అల్లూరుగా ప్రసిద్ధి చెందింది.
కైవల్య నది
జిల్లాలో వరదలకు కట్టలు తెంచుకుంటూ పరవళ్లు తొక్కే వాటిలో కైవల్య నది ఒకటి. వెంకటగిరి ప్రాంతంలోని వెలుగొండ అడవుల్లో పుట్టి చిల్లకూరు పరిధి గుమ్మళ్లదిబ్బ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. ఈ క్రమంలో దాదాపు 100 కి.మి.కిపైగా ప్రవహిస్తుంది. ప్రతి ఏడాది వర్షాలకు కైవల్య ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. వంతెనలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. వెలుగొండ అడవుల్లో కురిసిన వర్షానికి కాలువ వెంబడి వెంకటగిరి మీదుగా డక్కిలి పరిధి మాటుమడుగును తాకుతూ బాలాయపల్లి మీదుగా సైదాపురం ప్రాంతానికి వస్తుంది.
అక్కడి నుంచి నేరుగా విందూరు మీదుగా గూడూరు పట్టణ ప్రాంతాన్ని తాకుతుంది. ఇక్కడ మాత్రం కైవల్యను పంబలేరుగా పిలుస్తారు. అక్కడి నుంచి చిల్లకూరు పరిధి తిప్పగుంటపాళెం సమీపంలో గుమ్మళ్లదిబ్బ వద్ద సముద్రంలో కలుస్తుంది.
పెన్నా ఆనకట్ట
నెల్లూరు వద్ద 140 ఏళ్ల క్రితం నిర్మించిన ఆనకట్ట తరచూ తెగిపోయేది. కాటన్ దొర దీన్ని పరిశీలించి లోపాలను సరదిద్దారు. ఈ నెల్లూరు ఆనకట్ట కింద సర్వేపల్లి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువ ఉన్నాయి. సర్వేపల్లి కాలువ ద్వారా సర్వే రిజర్వాయరుకు నీరు అందుతుంది.
సంగం ఆనకట్ట
పెన్నానదిపై సంగం ఆనకట్ట 1882-85 మధ్య నిర్మించారు. ఇక్కడ నుంచి జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకి సాగునీటి సరఫరా జరుగుతోంది. కనిగిరి రిజర్వాయరు ప్రధాన కాలువ, కావలి, కనుపూరు, దువ్వూరు కాలువలతో పాటు నెల్లూరు చెరువుకు సాగునీటి సరఫరా అవుతుంది. నెల్లూరు నగరంతో పాటు కావలి పట్టణంలో తాగునీటి సరఫరాకు ఇక్కడి నుంచే నీరు అందుతోంది. ప్రస్తుతం ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో ప్రత్యామ్నాయాంగా రూ.122 కోట్ల వ్యయంతో కొత్త బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. సంగం ఆనకట్ట నుంచి నాలుగు సాగునీటి కాలువలు ఉన్నాయి. కుడివైపు కాలువ ద్వారా నెల్లూరు చెరువుకు, ఎడమవైపు కాలువ ద్వారా కనిగిరి రిజర్వాయరుకు నీరు అందుతుంది. మూడోది దువ్వూరు కాలువ కాగా నాలుగోది కనుపూరు కాలువ.


సోమశిల ప్రాజెక్టు
పెన్నానదిపై సోమశిల వద్ద భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం 1971లో ప్రారంభించారు. దీని కింద కావలి కాలువ, దక్షిణ కాలువ, ఉత్తర కాలువలు ఉన్నాయి. ప్రస్తుతం 70 టీఎంసీల నీరు నిల్వ ఉంటోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 4.25 లక్షల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేయాలన్నది ఆశయం. అయితే నాలుగు కాలువల తవ్వకాలు, ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తికావలసి ఉంది. కావలి కాలువ ద్వారా 31 చెరువులకు నీటి సౌకర్యం ఏర్పడింది. ఖరీఫ్‌లో 10,400 హెక్టార్లకు, రబీలో 20,890 హెక్టార్లకు సాగునీరు అందుతోంది.
కండలేరు జలాశయం
తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కండలేరు జలాశయాన్ని 1983 సంవత్సరంలో రాపూరు మండలంలో చెల్లటూరు గ్రామం వద్దనిర్మించారు. దీని మట్టకట్ట పొడవు 11 కి.మీ. ఆసియాలోనే అతిపెద్ద మట్టిడ్యామ్‌గా గుర్తింపు ఉంది. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు. తొలిసారిగా 2010లో 55 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ప్రతి ఏటా దీని నుంచి సత్యసాయి గంగ (కండలేరు-పూండి) కాలువ ద్వారా చెన్నై, తిరుపతి ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రిజర్వాయరు కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా ఇప్పటివరకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
కనిగిరి రిజర్వాయరు
బుచ్చిరెడ్డిపాళెం మండలంలో నెల్లూరు-ముంబయి రహదారి పక్కనే కనిగిరి రిజర్వాయరు ఉంది. దీన్ని 1882-86 మధ్య నిర్మించారు. సుమారు 24 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 3.5 టి.ఎం.సిల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని అప్పటి బ్రిటిషు పాలకులు కట్టారు. దీని ద్వారా బుచ్చి, సంగం, దగదర్తి, కోడవలూరు, కోవూరు, విడవలూరు, అల్లూరు మండలాల్లోని వ్యవసాయ భూములకు సాగు నీరందుతుంది. ప్రధానంగా సదరన్, ఈస్ట్రన్, పైడేరు ఎస్కేప్, న్యూ వవ్వేరు, యలమంచిపాడు కాలువలు, మలిదేవి మేజరు డ్రెయిన్‌ల ద్వారా ఏడు మండలాల్లోని 1.40 లక్షల ఎకరాలకు అధికారికంగా, మరో 40వేల ఎకరాలకు అనధికారికంగా సాగునీరందుతుంది.
స్వర్ణముఖి బ్యారేజీ
వాకాడు వద్ద స్వర్ణముఖి నదిపై రూ.50 కోట్లతో బ్యారేజీ నిర్మాణాన్ని 2005లో చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కృషి ఫలితంగా 34 గేట్లతో బ్యారేజీ కార్యరూపం దాల్చింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ బ్యారేజీ ద్వారా 10 చెరువు పరిధిలోని 9200 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షాలకు వచ్చే వరద నీటిని ఇక్కడ నిల్వ చేసి కాలువల ద్వారా చెరువులకు విడుదల చేస్తారు. ఆయకట్టుకు సాగునీరు చాలకపోతే తెలుగుగంగ జలాలను ఇక్కడికి మళ్లించిన సందర్భాలు ఉన్నాయి.
అల్లూరు డెల్టా
అల్లూరు డెల్టాలో అంచెలంచెలుగా సాగు విస్తీర్ణం పెరిగింది. నేడు 40 వేల ఎకరాలకు విస్తరించింది. పైడేరు వాగు ప్రధాన నీటి వనరు. మొదట శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కేవలం నాలుగు వందల ఎకరాలకు అల్లూరు చెరువు నుంచి సాగునీరు అందేది. తరువాత కాలంలో 1200 వందల ఎకరాలకు పెంచారు. సర్ అర్థర్ కాటన్ మహాశయుడు 19 శతాబ్ధం నాటికి డెల్టా ఆధునికీకరణ పూర్తి చేశారు. బ్రిటిషు కాలం నాటి సాగునీటి పారుదల కట్టడాలు, తూముల ద్వారా అధిక విస్తీర్ణంలో పంట సాగు అవుతోంది.

నెల్లూరు జిల్లాకు జీవనాడి పెన్నానది. జిల్లాలో 112 కి.మీ. మేర ప్రవహించే ఈ నది సాగు, తాగునీటి కొరత తీరుస్తోంది. శతాబ్ధం పూర్వం ఈ నదిపై నెల్లూరు, సంగం వద్ద ఆనకట్టలు కట్టారు. వీటిద్వారా కోవూరు, నెల్లూరు, బుచ్చి, ఇందుకూరుపేట తదితర మండలాల్లో లక్షా అయిదు వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
జిల్లాలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా పంటల సాగు దైవాదీనం. అనిశ్చితి వాతావరణం సాగు విస్తీర్ణం, పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఖరీఫ్ కంటే రబీ సీజన్‌లోనే రెండింతల విస్తీర్ణంలో పంటల సాగు అవుతుంది. భారీ నీటిపారుదల కింద పెన్నా డెల్టా వ్యవస్థ ద్వారా 1.28 లక్షల హెక్టార్లకు మించి నీరు అందుతుంది. మధ్యతరహా నీటిపారుదల కింద ఉన్న కనుపూరు కెనాల్ ద్వారా 7,635 హెక్టార్లు, గండిపాళెం జలాశయం ద్వారా 6,478 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. సాధారణంగా సాగునీటి కాలువల ద్వారా చెరువులకు నీరు అందుతుంది. దీనికితోపాటు వర్షపునీరు చేరుతుంది. జిల్లాలో 1763 చెరువులు ఉండగా, వీటి కింద 2,98,375 ఎకరాలు ఆయకట్టు ఉంది. అనువైన పరిస్థితులు ఉంటే కాలువల ద్వారా 1.36 లక్షల హెక్టార్లు, చెరువుల ద్వారా 72 వేల హెక్టార్లు, బోర్లు- ఫిల్టర్‌పాయింట్ల ద్వారా 67 వేల హెక్టార్లు, ఇతర బావుల ద్వారా 25 వేల హెక్టార్లు, ఎత్తిపోతలు, ఇతర వనరుల ద్వారా 8వేల హెక్టార్లకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం ఉండగా ఒకసారికి మించి సాగునీరు అందుతున్న భూములు 69 వేల హెక్టార్లు.
 
గండిపాళెం జలాశయం
ఉదయగిరి మండలంలో పొన్నెబోయిన చెంచురామయ్య గండిపాళెం జలాశయం ఉంది. దీనిని మాజీఎమ్మేల్యే చెంచురామయ్య ఎమ్మేల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. ఈ జలాశయం నీటితో ఉదయగిరి, వరికుంటపాడు మండలాలకు చెందిన 16000 ఎకరాలకు నీటిపారుదల జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 8 వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. పూర్తయితే 16 వేల ఎకరాలకు నీరు అందుతుంది.

ప్రధాన పంట.. వరి
జిల్లా వ్యాప్తంగా 70 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధార పడి ఉన్నారు. ఇందులో 60 శాతం వరి సాగు చేస్తున్నారు. మొలగొలుకులు, నెల్లూరు మసూర, జిలకర మసూర, ఎంటీయూ 1010, బుడ్డలు వరి రకాలను ఎక్కువగా పండిస్తున్నారు. మినుము, వేరుశనగ, శనగ, నువ్వు వంటి మెట్టపైర్లతో పాటు ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు.
ఉద్యాన పంటలు: జిల్లాలో ఉద్యాన పంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వింజమూరు, గూడూరు, పొదలకూరు, కావలి, ఆత్మకూరు తదితర మండలాల్లో ఉద్యాన పంటలు ఎక్కువ. ప్రధానంగా నిమ్మ, మామిడి, బత్తాయి, అరటి, సపోటా సాగు చేస్తున్నారు. ఈ పంటలపై 20 శాతం రైతులు ఆధారపడి ఉన్నారు.
వరి, మినుము, వేరుశనగ, చెరకు, పచ్చిశెనగ, పొగాకు
రబీలో పంటల విస్తీర్ణం..
వరి - 5లక్షల ఎకరాలు
మినుము - 75వేల ఎకరాలు
వేరుశనగ - 12వేల ఎకరాలు
చెరకు - 20వేల ఎకరాలు
పచ్చిశనగ - 25వేల ఎకరాలు
పొగాకు - 30వేల ఎకరాలు
ఖరీఫ్‌లో.. రబీ విస్తీర్ణంలో నాలుగో వంతు సాగవుతుంది.
జిల్లాలో వర్షాల పరిస్థితిని బట్టి ఏడాదికి రెండు పంటలను మాత్రమే సాగు చేస్తున్నారు. సాగునీరు పుష్కలంగా అందే మండలాల్లో మూడో పంటను వేస్తారు. ఖరీఫ్ సీజన్‌లో మొదటి పంటగా 1.50లక్షల ఎకరాల్లో వరిని సాగుచేస్తారు. రెండో పంటగా రబీలో వరిని దాదాపు 5లక్షల ఎకరాల్లో రైతులు పండిస్తారు.
రైతుసేవలో చిరుధాన్య పరిశోధనకేంద్రం
అర్ధశతాబ్ధ కాలంగా మెట్ట రైతుకు వెన్నుదన్నుగా పొదలకూరులోని చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం చేయూతనందిస్తోంది. పొదలకూరు వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని పొదలకూరు, కలువాయి, చేజర్ల, రాపూరు మండలాల్లో సాగుచేసే మినుము, పెసర, కంది, శనగ వంటి మెట్ల పంటలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అధిక దిగుబడలు సాధించే వంగడాలను ప్రవేశపెట్టారు. మినుములో పీబీజీ-1 రకం అన్ని కాలాల్లో సాగుకు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులిస్తోంది. వ్యవసాయ సీజన్‌లో ఆధునిక వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు సలహాలు అందిస్తూ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు సేవలందిస్తున్నారు.
పెట్లూరు నిమ్మ పరిశోధన కేంద్రం
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరులో నిమ్మ పరిశోధనాకేంద్రం ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన 1992లో ఏర్పాటైన ఈ కేంద్రం కాలక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో చేరింది. ఇక్కడ చేసిన పరిశోధన ఫలితంగా తెగుళ్లను తట్టుకోగలిగిన పెట్లూరు సెలక్షన్-1 నిమ్మ వంగడాన్ని రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఇంకా పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సాగు చేయగల ఇతర నిమ్మ జాతులపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
శాస్త్రవేత్త డాక్టర్ బి.జి.రాజులు : 9441937460

కళాశాలలు

జవహరభారతి పాఠశాల/డిగ్రీ కళాశాల, కావలి : 9247828815
విట్స్ ఇంజినీరింగు కళాశాల, వెంగళరావునగర్, కావలి : 9849417718
విశ్వోదయ ఇంజినీరింగు కళాశాల, వెంగళరావునగర్, కావలి : 9666770979
డీబీఎస్ ఇంజినీరింగు కళాశాల, మద్దూరుపాడు, కావలి : 9440218260
పద్మావతి కళాశాల, పుల్లారెడినగర్, కావలి : 9866947116

అల్లూరు మండలం
రామకృష్ణ జూనియర్ కళాశాల, అల్లూరు : 08622 276447
రామకృష్ణ డిగ్రీ కళాశాల, అల్లూరు : 9908242447

బోగోలు మండలం
ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, కడనూతల : 08626 255655
ప్రభుత్వ జూనియర్ కళాశాల, కప్పరాళ్లతిప్ప : 08626 213633

నెల్లూరు గ్రామీణ మండలం
బొల్లినేని నర్శింగ్ కళాశాల, ధనలక్ష్మీపురం, నెల్లూరు మండలం : 9490142500
నారాయణ నర్శింగ్ కళాశాల, చింతారెడ్డిపాళెం, నెల్లూరు మండలం: 9490166200
రత్నం పబ్లిక్ స్కూల్, ధనలక్ష్మీపురం, నెల్లూరు : 9160610555
వి.బి.ఆర్ రెసిడెన్సియల్ హైస్కూల్ ధనలక్ష్మీపురం, నెల్లూరు : 9391616170
నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, హరనాధపురం, నెల్లూరు : 9490166188
నారాయణ కాన్సెప్ట్ స్కూల్, హరనాధపురం, నెల్లూరు : 9912342683
డికెడబ్ల్యు ప్రభుత్వ కళాశాల, దర్గామిట్ట, నెల్లూరు : 9948121701
ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల, కనుపర్తిపాడు, నెల్లూరు మండలం : 9985774578
ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళా కళాశాల, కె.వి.ఆర్ పెట్రోల్‌బంకు వద్ద, నెల్లూరు : 9912342048

కోవూరు మండలం
కెఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల, కోవూరు : 9441685868
గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల, గంగవరం, కోవూరు మండలం : 9912445846
శ్రీహర్ష పీజీ కళాశాల, పోతిరెడ్డిపాళెం, కోవూరు : 9885742224
ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇందుకూరుపేట : 94401 40619

ఉదయగిరి మండలం
ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉదయగిరి : 9494105465
మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, ఉదయగిరి : 9441054906
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉదయగిరి : 9866755024

సీతారామపురం మండలం
ఎల్‌వీఆర్ జూనియర్ కళాశాల, సీతారామపురం : 9490427488
సీతారామ డిగ్రీ కళాశాల, సీతారామపురం : 9441938527
ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొండాపురం : 9441686383
ప్రభుత్వ జూనియర్ కళాశాల, చేజర్ల : 9440344290

కలువాయి మండలం
ప్రభుత్వ జూనియర్ కళాశాల, కుల్లూరు (కలువాయి మండలం) : 08628 213430
శివాసాయి జూనియర్, డిగ్రీ కళాశాల, కలువాయి : 9441028704

నాయుడుపేట మండలం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాయుడుపేట : 08623 248075
సి.వి.రామన్ కళాశాల, నాయుడుపేట : 08623 247481
ప్రభుత్వ జూనియర్ కళాశాల, నాయుడపేట: 08623 248263
చదలవాడ జూనిమర్ కళాశాల, నాయుడుపేట : 08623 248447
వేమ జూనియర్ కళాశాల, నాయుడుపేట : 08623 248784
విశ్వం జూనిమర్ కళాశాల, నాయుడుపేట : 08623 248574

బుచ్చిరెడ్డిపాళెం మండలం
సిద్దార్థ జూనియర్ కాలేజి, గాంధీనగర్, బుచ్చిరెడ్డిపాళెం : 08622 252679
గ్లోబల్ కాలేజి ఆఫ్ నర్సింగ్, గ్లోబల్ నగర్, బుచ్చిరెడ్డిపాళెం : 08622 253222
విద్యాభారతి ఐటీఐ, జెండాదిబ్బ రోడ్డు, బుచ్చిరెడ్డిపాళెం :08622273099

వెంకటాచలం మండలం

వెంకటాచలంలో అక్షర విద్యాలయ
ప్రభుత్వ జూనియర్ కళాశాల, వెంకటాచలం : 9441992022
పి.ఆర్.ఆర్. జూనియర్ కళాశాల, వెంకటాచలం :
నారాయణ మహిళా జూనియర్ కళాశాల, చెముడుగుంట, వెంకటాచలం మండలం :
సనా బీఇడి, ఎంబీఏ, ఎంసీఏ కళాశాల, చెముడుగుంట వెంకటాచలం మండలం : 9949895610
కృష్ణచైతన్య జూనియర్ కళాశాల, కాకుటూరు, వెంకటాచలం మండలం :
చైతన్య భారతి డిగ్రీ కళాశాల, వెంకటాచలం :
క్యూబా ఇంజినీరింగు కళాశాల, వెంకటాచలం : 98483 66215
ఏవీఎస్ ఇంజినీంగు కళాశాల, ఎర్రగుంట, వెంకటాచలం మండలం : 9396782581
జగన్ ఇంజినీరింగు కళాశాల, చవటపాళెం : 0861 6518625
స్వాతి ఫార్మశీ కళాశాల, వెంకటాచలం :
రావూస్ ఫార్మశి, ఎంబీఏ, ఎంసీఏ కళాశాల, చెముడుగుంట : 98481 85703
వేళాంగిణి బీఇడి కళాశాల, వెంకటాచలం : 98481 85703
'అక్షర విద్యాలయ' ఇంటర్నేషనల్ స్కూలు, సరస్వతీ నగర్,వెంకటాచలం : 0861 2383504, 2383505

కొడవలూరు మండలం
బ్రహ్మయ్య ఇంజినీరింగ్ కళాశాల, నార్తురాజుపాళెం : 08622 255090
బ్రహ్మస్ ఇంజినీరింగ్ కళాశాల , రామన్నపాళెం : 98482 50610
లెండి ఫార్మసీ/ డిగ్రీ కళాశాల, కొడవలూరు : 99496 93662

పొదలకూరు మండలం
ప్రభుత్వ జూనియర్ కళాశాల, పొదలకూరు : 08621-225422 (ప్రిన్సిపల్ వెంకటసుబ్బయ్య)
ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, పొదలకూరు : 08621-225279(ప్రిన్సిపల్ డి. కోదండరామిరెడ్డి)

వెంకటగిరి మండలం
విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వెంటకగిరి : 08625-257063
ప్రభుత్వ జూనియర్ కళాశాల, వెంకటగిరి : 08625-255330

రాపూరు మండలం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాపూరు : 98663 22172
ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాపూరు : 99851 12692
వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, రాపూరు : 96034 34334
గురుకుల జూనియర్ కళాశాల, కండలేరు డామ్ : 97045 50101

అనుమసముద్రంపేట మండలం
టీఎస్ఎం జూనియర్ కళాశాల, అనుమసముద్రంపేట : 99665 08782
సాయిరాం జూనియర్ కళాశాల, అనుమసముద్రంపేట : 08627 226271

సంగం మండలం
నేతాజీ డిగ్రీ కళాశాల, సంగం
ఎన్‌పీఎం జూనియర్ కళాశాల, సంగం

మర్రిపాడు మండలం
ప్రభుత్వ జూనియర్ కశాశాల : 08620 214414

మెగా ప్రాజెక్టులు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 19 మెగా ప్రాజెక్టులు / ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) ఉన్నాయి. వీటికి ప్రతిపాదించిన పెట్టుబడి రూ. 79,487.84 కోట్లు. మొత్తం 1,28,900 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటిలో రెండు ప్రాజెక్టులు ఉత్పత్పి ప్రారంభించగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
భారీ, మధ్యతరహా పరిశ్రమలు: జిల్లాలో భారీ, మధ్యతరహా పరిశ్రమలు 50 ఉన్నాయి.
 
వీటికి వెచ్చించిన పెట్టుబడి రూ. 1,257.41 కోట్లు. వీటి ద్వారా 11,916 మందికి ఉపాధి పొందుతున్నారు. వీటికి అదనంగా మరో 29 పరిశ్రమలు ప్రాథమిక, నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటి స్థాపిత వ్యయం రూ. 945.13 కోట్లు. ఇవి వస్తే 5,870 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
చిన్నతరహా పరిశ్రమలు: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చిన్నతరహా పరిశ్రమలు 30,869 ఉన్నాయి. వీటి స్థాపిత పెట్టుబడి 435.51 కోట్లు. 2006 అక్టోబరు 1 నాటికి ఇవి 1,28,429 మందకి ఉపాధి కల్పిస్తున్నాయి.
ప్రత్యేక ఆర్థిక మండళ్లు: నెల్లూరు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) కోసం 8,227.57 ఎకరాల భూమిని ఏపీఐఐసి సేకరించింది.
ఎం.పి. సెజ్ (నాయుడుపేట): నాయుడుపేట మండలంలోని మేనకూరు, ద్వారకాపురం ప్రాంతాల్లో 2,549.79 ఎకరాల భూములను ఎంపీ సెజ్ కోసం ఏపీఐఐసీ సేకరించి పరిశ్రమలకు కేటాయించింది.
హెమైర్ సిస్టమ్ ఇండియా (ప్రై) లిమిటెడ్: 25.00 ఎకరాలు
గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా (ప్రై)లిమిటెడ్: 210.00 ఎకరాలు
ప్రైమ్ ఎలక్ట్రిక్ లిమిటెడ్: 100.00 ఎకరాలు
కృష్ణపట్నం సెజ్: కృష్ణపట్నం సెజ్ కోసం తూర్పు కనుపూరు, వెళ్లపాళెం, సిద్దవరం, కార్లపూడి గ్రామాల్లో 4,409.72 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించి సెజ్ అభివృద్ధి చేసేందుకు కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు కేటాయించింది.
మాంబట్టు సెజ్: తడ మండలంలోని మాంబట్టు గ్రామంలో 250.49 ఎకరాలను ప్రత్యేక ఆర్ధిక మండలి కోసం సేకరించారు. దీన్ని తోలు పరిశ్రమల సెజ్ అభివృద్ధికి భారతీయ ఇంటర్నేషనల్ సెజ్ లిమిటెడ్ సంస్థకు కేటాయించారు.
చింతవరం సెజ్: చిల్లకూరు మండలంలో చింతవరం, ఏరూరు గ్రామాల్లో 714.00 ఎకరాలను సేకరించారు. ఇక్కడ వస్త్ర పరిశ్రమల (టెక్ట్స్‌టైల్) సెజ్ అభివృద్ధికి మాస్ ఫ్యాబ్రిక్ పార్క్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు కేటాయించారు.
ఇండస్ట్రియల్ పార్కులు: జిల్లాలో పరిశ్రమల పార్కుల స్థాపన కోసం 26,461.00 ఎకరాల భూములు కావాలంటూ ఏపీఐఐసీకి దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు భారీ, మధ్యతరహా పరిశ్రమలకు 16,670.73 ఎకరాలను అప్పగించారు.
ఈ పరిశ్రమల స్థాపన కోసం ప్రతిపాదిత వ్యయ అంచనా మొత్తం రూ. 20,100 కోట్లు కాగా వీటి ద్వారా 39,000 ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. 
అపాచీ సెజ్: తడ మండలంలో మాంబట్టు గ్రామంలో 313.57 ఎకరాలను ప్రభుత్వం సేకరించి పాదరక్షల పరిశ్రమ కోసం అపాచీ అన్వెస్ట్‌మెంటు హోల్డింగ్సు ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు కేటాయించారు.
థర్మల్ విద్యుత్తు కేంద్రాలు
కృష్ణపట్నం సెజ్‌లో థర్మల్ విద్యుత్కేంద్రాలు, ఇతర పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడి ఓడరేవు ఆధారంగా ముత్తుకూరు, చిల్లకూరు మండలాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి (1600మెగావాట్లు) 1500ఎకరాల్లో, నెల్‌కాస్ట్ (1320మె.వా.) 1015ఎకరాలు, కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్‌కు (3960 మె.వా.) 2687 ఎకరాలు, సింహపురి ఎనర్జీరి (1480మె.వా.) 717ఎకరాలు, మీనాక్షికి (2320మె.వా.) 1066ఎకరాలు, కెనటా పవర్ ప్రాజెక్టుకు (1980 మె.వా.) 1437ఎకరాలు, కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్‌కు (1980మె.వా.) 1490ఎకరాలను కేటాయించారు. ఇప్పటికే ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ కేంద్రంలో చిమ్నీ, పవర్‌హౌస్ నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి.

కోవూరు సహకార చక్కెర కర్మాగారం
స్థాపితం: 1979
క్రషింగు సామర్థ్యం : ప్రస్తుతం రోజుకు 2500 టన్నులు
విశేషాలు :
 నెల్లూరు నగరానికి ఆనుకొని పెన్నానదికి ఆవతలివైపు (ఉత్తరం వైపు) కోవూరు మండలం పరిధిలోని పోతిరెడ్డిపాళెం గ్రామంలో కోవూరు సహకార చక్కెర కర్మాగారం ఉంది. ఆరు ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించగా మొత్తం 120 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది.
విశిష్టతలు: దక్షిణభారత దేశంలో ఏ కర్మాగారానికి లేని విధంగా కోవూరు షుగర్స్‌కు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున చెరకును పండిస్తారు. కర్మాగారం పరిధిలో 5వేల ఎకరాల్లో మూడు వేల మంది రైతులు చెరకు సాగు చేస్తున్నారు. పెన్నా డెల్టా ప్రాంతం కావడంతో చెరకు దిగుబడి బాగా వస్తుంది. ఒకప్పుడు చక్కెర ఉత్పత్తిలో దక్షిణభారతదేశంలోనే కోవూరు షుగర్స్ ప్రథమ స్థానంలో ఉండేది.
యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలు, ఆక్వా వైపు రైతులు మొగ్గు చూపడం, చక్కెర ఉత్పత్తి వ్యయం కంటే అమ్మకం ధర తక్కువ కావడం, చెరకు సరఫరా చేసే రైతులకు సకాలంలో చెల్లింపులు జరగక పోవటం వల్ల కర్మాగారం క్రమేణా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీన్ని ప్రయివేటు వ్యక్తులకు విక్రయించాలని 2003లో ప్రభుత్వం నిర్ణయించగా స్థానికంగా ఉద్యమించి, కోర్టుకు వెళ్లి ఫ్యాక్టరీని నిలబెట్టుకున్నారు.
కృష్ణపట్నం ఓడరేవు
ఆసియాలోనే అతి పెద్ద ఓడరేవుగా రూపాంతరం చెందుతున్న కృష్ణపట్నం ఓడరేవు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సుగంధ ద్రవ్యాలు ఇక్కడ దిగుమతులు జరిగినట్లు చరిత్రలో ఉంది. అనాటి నుంచి పలు సరుకులు ఎగుమతులు దిగుమతులు సాగినట్లు చెబుతుంటారు. అందకనే ఈరేవుకు కృష్ణపట్నంగా వచ్చిందని ప్రాసశ్త్యం. సహజ సిద్ద రేవుగా రాష్ట్ర ప్రభుత్వం 1980లో గుర్తించింది.

విదేశీ సంస్దలచే పలు సర్వేలు నిర్వహించింది. అనంతరం 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది కోసం నాట్కో సంస్దతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిర్చారు. 2006లో తిరిగి నవయుగ సంస్ద చేపట్టింది. 2007 జులైలో యుపిఎ ఛైర్మన్ సోనియాగాంధీ రేవును జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 940 నౌకలు రాకపోకలు సాగించాయి. ఎనిమిది బెర్తులు పూర్తి కాగా తొలి దశలో రూ.1,800కోట్లతో పనులు జరగగా రెండో దశలో రూ.4వేల కోట్ల అంచనాలతో బెర్తులు,యార్డుల నిర్మాణాలు సాగుతున్నాయి. గత ఏడాది వరకు ప్రదానంగా ముడి ఇనుప ఖనిజం ఎగుమతులు చైనాకు జరిగాయి. బొగ్గు,ఎరువులు, ముడి చక్కెర, పరిశ్రమలకు అవసరమైన భారీ సామాగ్రి వంటివి దిగుమతులు చేస్తున్నారు. ఫెల్డ్‌స్పర్డ్, గ్రానైట్ ఖనిజాలు పలు దేశాలకు నౌకల్లో రేవు నుంచే పంపారు. దాదాపు 5,600ఎకరాల భూమిని రేవు అభివృద్ది కోసం సేకరించారు. జాతీయ రహదారిని కలుపుతూ 19కి.మీ మేర రోడ్డును రైల్వే లైను నిర్మాణాలు పూర్తయ్యాయి.
గతమెంతో ఘనం..
దక్షణ ఆసియా ఖండంలోనే బిట్రగుంట రైల్వే ప్రగతి పట్టాలపైకి బ్రిటిష్ హయాంలోనే చేరింది. కాలానుగుణంగా విజయవాడ - చెన్నైల మధ్య ఎలక్ట్రికల్ ఇంజిన్ల ప్రవేశంతో గ్రహణం పట్టింది. ఒకేసారి 44 స్టీమ్ ఇంజన్ల మరమ్మతు సామర్థ్యం కలిగిన లోకోషెడ్డు వెలవెలబోయింది. బిట్రగుంట రైల్వే యార్డు వెయ్యి ఎకరాల మేర విస్తరించి ఉంది. ఇక్కడ రూ. వందల కోట్లు విలువచేసే ఆస్తులు తుప్పు పడుతున్నాయి. ఇటీవల బిట్రగుంట - దొనకొండల మధ్య రైల్వే మార్గం సర్వేకు రైల్వే బడ్జెట్‌లో అనుమతి లభించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి.

సతీష్‌ధావన్ షార్ సెంటర్
అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు కలిగిన రాకెట్ ప్రయోగ కేంద్రం సూళ్లూరుపేటకు సమీపంలోని శ్రీహరికోటలో ఉంది. ఎన్నో విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాలతో భారతదేశానికి ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చింది. సూళ్లూరుపేటకు తూర్పున పులికాట్ సరస్సు, బంగాళాఖాతం మధ్య చిట్టడవిలాంటి ద్వీపం శ్రీహరికోట. పూర్వం ఇక్కడ తూర్పు రెడ్లు, చల్లా యానాదులు నివసించేవారు. నాలుగు దశాబ్దాల క్రితం అంతరిక్ష ప్రయోగ కేంద్రం... షార్ ఏర్పాటుతో వీరిని ఖాళీ చేయించి, కొంచెం దూరంలో పునరావాసం కల్పించారు.
 

సోమశిల డామ్
జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న సోమశిల సాగునీటి ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగానూ గుర్తింపు పొందింది. అనంతసాగరం మండలంలోని సోమశిల వద్ద పెన్నానదిపై జలాశయాన్ని నిర్మించారు. కడప జిల్లా సరిహద్దుల్లో తూర్పు కనుమల మధ్య కట్టిన డామ్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ సోమేశ్వరుని ఆలయం, నది ఆవల ఆశ్రమం ఉంది. ఇక్కడి పర్యాటకులతో పాటు పాఠశాల విద్యార్థులు విజ్ఞానయాత్రకు వస్తుంటారు

కండలేరు డామ్
వెలిగొండల పర్వత శ్రేణుల్లో పుట్టిన కండలేరు నదిపై చిల్లటూరు వద్ద ఆనకట్ట కట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద మట్టి డామ్ కాగా 68 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ మట్టికట్ట పొడవు 11 కి.మీ. ఈ జలాశయం నుంచి సాయిగంగ కాలువ ద్వారా తిరుపతి, చెన్నై ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తుంటారు. చుట్టుపక్కల పచ్చని అడవులు, గుట్టలతో నిండిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆకట్టుకుంటోంది.
కృష్ణపట్నం ఓడరేవు
ఆసియాలోనే అతి పెద్ద ఓడరేవుగా రూపాంతరం చెందుతున్న కృష్ణపట్నం ఓడరేవు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ సుగంధ ద్రవ్యాలు దిగుమతులు జరిగినట్లు చరిత్రలో ఉంది. పూర్వం నుంచి పలు రకాల సరకుల ఎగుమతి, దిగుమతులు సాగేవి. కృష్ణపట్నాన్ని సహజ సిద్ధ రేవుగా రాష్ట్ర ప్రభుత్వం 1980లో గుర్తించింది. విదేశీ సంస్థలతో పలు సర్వేలు నిర్వహించింది. ఇక్కడ రేవు ఏర్పాటుకు 5,600 ఎకరాల భూమిని సేకరించింది.
అనంతరం 1996లో రేవు అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాల్కో సంస్థతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిర్చారు. 2006లో రేవు నిర్మాణ పనులను నవయుగ సంస్థ చేపట్టింది. 2007 జులైలో యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ కృష్ణపట్నం రేవును జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి 2011 మార్చి వరకు దాదాపు 940 నౌకలు రాకపోకలు సాగించాయి. తొలి దశలో రూ.1,800 కోట్లతో ఎనిమిది బెర్తుల నిర్మాణం పూర్తి కాగా రెండో దశలో రూ.4వేల కోట్ల అంచనాలతో బెర్తులు, యార్డుల పనులు సాగుతున్నాయి. గత ఏడాది వరకు ప్రధానంగా ముడి ఇనుప ఖనిజం చైనాకు ఎగుమతి అయింది. బొగ్గు, ఎరువులు, ముడి చక్కెర, పరిశ్రమలకు అవసరమైన భారీ సామగ్రి వంటివి దిగుమతి అవుతున్నాయి. ఫెల్డ్‌స్పర్, గ్రానైట్ ఖనిజాలు ఇక్కడి రేవు నుంచే నౌకల్లో పలు దేశాలకు రవాణా అవుతున్నాయి. జాతీయ రహదారిని కలుపుతూ 19 కి.మీ మేర రోడ్డుతో పాటు రేవు వరకు రైల్వే లైను నిర్మాణం పూర్తయింది.
పులికాట్ సరస్సు
ఆసియాలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్. ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో 600 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. నెల్లూరు జిల్లా వాకాడు, చిట్టమూరు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాలతో పాటు తమిళనాడు పరిధిలో సరస్సు ఉంది. దీనికి విదేశీ వలస పక్షుల ఆహార భాండాగారంగా గుర్తింపు ఉంది. దీన్ని 1976లో పక్షుల రక్షిత కేంద్రంగా నోటిఫై చేశారు. ఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు దేశవిదేశాల నుంచి 50 లక్షలకు పైగా వలస పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి.

నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం
నెల్లూరుకు 85 కి.మీ. దూరంలో జాతీయ రహదారికి సమీపంలో దొరవారిసత్రం వద్ద నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఉంది. పెలికాన్ ప్యారడైజ్‌గా పిలిచే ఇక్కడి పులికాట్ సరస్సు వలస పక్షుల విడిదిగా మారింది. ఏటా ఇక్కడికి వచ్చే రెండు వేలకు పైగా పెలికాన్‌లతో పాటు ఇతర రకాల వలస పక్షులు, ప్రకృతి అందాలు సందర్శకులకు కనువిందుచేస్తాయి. నేలపట్టు మంచినీటి చెరువులో పెరిగిన మడ అడవులు గూళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉండగా పక్షుల ఆహారానికీ లోటు ఉండదు. అందుకే వలస పక్షులు సంతతిని అభివృద్ధి చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటాయి.
పొట్టి శ్రీరాములు ఉద్యమాల వేదిక.. జువ్వలదిన్నె
బోగోలు మండలంలోని తీర ప్రాంత గ్రామం జువ్వలదిన్నె.. అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమాలకు వేదికగా నిలిచింది. ఇక్కడ 1938-48 మధ్య వైద్యాధికారిగా పనిచేసిన సోదరుడు పొట్టి రంగయ్యగుప్తా వద్ద పొట్టి శ్రీరాములు ఉండేవారు. జువ్వలదిన్నెను వేదికగా చేసుకుని జిల్లా వ్యాప్తంగా సమసమాజ స్థాపనకు ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అమరజీవి నడయాడిన ఈ గ్రామంలో 2007లో పొట్టి శ్రీరాములు స్మారక భవనం నిర్మించారు.
ఉదయగిరి దుర్గం
గజపతులు, చోళులు, విజయనగర రాజులు, రెడ్డిరాజులు, మహమ్మదీయులు వంటి ఎన్నో వంశాలు పరిపాలించిన ఉదయగిరి అలనాడు ప్రముఖ కేంద్రంగా విరాజిల్లింది. విజయనగర రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. వెయ్యేళ్ల ఘన చర్రితకు నిదర్శనంగా ఇక్కడ శిథిలమైన దుర్గం నిలిచి ఉంది. భావి తరాలకు గత వైభవాన్ని చాటుతోంది. సంజీవి పర్వతంగా పేరుగాంచిన ఉదయగిరి కొండపై నిర్మితమైన దుర్గం (కోట) 35 కి.మీ. మేర విస్తరించి 365 దేవాలయాలతో విలసిల్లినట్లు చరిత్ర చెబుతుంది.
ఇక్కడి రంగనాధుని ఆలయం చోళ సంస్కృతిని, బాలకృష్ణ మందిరం పల్లవుల నాటి శిల్పకళను, పారువేట మండపం విజయనగర రాజుల నాటి కళానైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఇక్కడ చిన్నమసీదు, పెద్ద మసీదు కూడా దర్శనీయ స్థలాలుగా గుర్తింపు పొందాయి. అబ్బురపరిచే రాతిశిల్పాలతో పాటు తిరుమలగిరి కొండలను పోలిన విధంగా ఎత్తయిన ప్రాకారాలతో చూడముచ్చటగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3097 మీటర్ల ఎత్తులో దుర్గం ఉంది. నెల్లూరు నుంచి 100 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి శిల్పకళా చాతుర్యం, కొండపై నుంచి జాలువారే జలపాతం, పచ్చదనం, పక్షుల కిలకిలరావాలు పర్యాటకుల మనస్సును ఇట్టే దోచేస్తాయి.
వెంకటగిరి -దుర్గం
దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తయిన పచ్చని కొండలు, పురాతన కట్టడాలు, ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది వెంకటగిరి దుర్గం. సముద్ర మట్టానికి 928 మీటర్ల ఎత్తులో ఉంది. రాచరిక వ్యవస్థలో కొండలపై దుర్గం ఏర్పడింది. వెంకటగిరి గ్రామదేవత కలివేలమ్మ ఆలయం ఇక్కడ నిర్మితమైంది. కాలక్రమంలో దోపిడీలకు పాల్పడే పాలేగాళ్లు దుర్గాన్ని ఆక్రమించి తమ స్థావరంగా మార్చుకున్నారు. అప్పటి వెంకటగిరి రాజా ఓ పున్నమిరాత్రి సైన్యంతో ముట్టడించి పాలేగాళ్లను తుదముట్టించినట్లు చరిత్ర.

పాలేగాళ్లు దోచుకున్న నిధులను ఇక్కడ దాచారన్న నమ్మకంతో కొందరు గుట్టుగా తవ్వకాలు సాగిస్తుంటారు. దీని ఫలితంగా దుర్గం క్రమంగా కనుమరుగవుతోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి యువకులు ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వస్తుంటారు. వెంకటగిరికి 17 మైళ్ల దూరంలో దుర్గం ఉంది. పాళెంకోట వరకు రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి ఏడు మైళ్లు కాలినడకన చేరుకోవలసి ఉంటుంది.
పల్లిపాడు గాంధీ ఆశ్రమం
గాంధీజీ స్వయంగా దేశంలోనే రెండోదిగా సత్యాగ్రహ ఆశ్రమాన్ని పల్లిపాడులో స్థాపించారు. దీన్ని కేంద్రంగా చేసుకుని ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపారు. ఇందుకూరుపేట మండలంలో పెన్నానది తీరాన ఉన్న ఈ పినాకిని గాంధీ ఆశ్రమం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఆధునికీకరించడంతో పాటు గాంధీజీ చిత్రప్రదర్శన వంటి ప్రత్యేక హంగులు సమకూర్చారు. ఈ ఆశ్రమం నెల్లూరుకు తూర్పున 9 కి.మీ. దూరంలో ఉంది.
ఉప్పు సత్యాగ్రహ స్థూపం
గాంధీజీ దండిలో ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునివ్వడంతో ఇందుకూరుపేట మండలంలోని మైపాడు తీరంలోనూ ఉప్పు పండించారు. బ్రిటిషు పాలకులకు ఎదురొడ్డి తీరప్రాంతంలో ఉప్పును పండించి పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు. ఈ ఉద్యమంలోనే బెజవాడ గోపాల్‌రెడ్డి తొలిసారిగా పాల్గొని అరెస్టయి బళ్లారి జైలులో శిక్షను అనుభవించారు. ఇక్కడ ఉప్పు సత్యాగ్రహానికి గుర్తుగా స్థూపం కూడా ఏర్పాటయింది. ఇది నెల్లూరు నగరానికి 20 కి.మీ. దూరంలో సముద్ర తీరాన ఉంది.